ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా నేటి నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో జస్ప్రీత్‌ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. రోహిత్‌కు ఇవాళ ఉదయం జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ కోవిడ్‌ పాజిటివ్‌గానే ఉన్నందున, ఐదో టెస్ట్‌కు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ వ్యవహరిస్తాడని ఆయన పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)