ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. 58 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో వార్నర్‌ అజేయంగా నిలిచాడు. కాగా భువనేశ్వర్‌ కుమార్‌ ఓవర్‌లో వార్నర్‌ ఆడిన షాట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తొలి బంతిని వేయడానికి సిద్దమయ్యాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న వార్నర్‌ స్విచ్‌ హిట్‌ ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే ముందుగానే పసికట్టిన భువీ.. వైడ్‌ యార్కర్‌ వేశాడు. అయితే భువనేశ్వర్ బౌలింగ్‌ తగ్గట్టుగానే.. వార్నర్‌ క్షణాల్లో తన ప్లాన్ మార్చుకుని రైట్ హ్యాండర్ ఆడినట్లు షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)