టాటా ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్‌ స్టేడియానికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు.

అయితే మ్యాచ్‌ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్‌ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొం‍ది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.  పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, అందులో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు, సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్

Here's Videos

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)