భారత ఓపెనర్ KL రాహుల్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. 11 ఏళ్ల వర్ధమాన క్రికెటర్‌ను రక్షించడానికి 31 లక్షల రూపాయలను విరాళంగా అందించాడు. ఆ మువ ఆటగాడికి అత్యవసర బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) చేయాల్సి ఉంది. భీమా ఏజెంట్ అయిన వరద్ నలవాడే తండ్రి సచిన్ మరియు తల్లి స్వప్న ఝా తమ కుమారుడి చికిత్స కోసం ప్రచారాన్ని ప్రారభించారు. బతికించుకునేందుకు చేతులు చాచారు. వరద్ గురించి తెలిసిన వెంటనే రాహుల్ బృందం ప్రచారానికి సంబంధించిన సంస్థతో సంప్రదింపులు జరిపింది. వెంటనే రాహుల్ 31 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం బాలుడు ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమటాలజిస్టుల సంరక్షణలో ఉన్నాడు. బాలుడు అరుదైన రక్త రుగ్మత అయిన అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్నాడు.
KL Rahul who donated 31 Lakhs for a young boy's treatment said,"when I came to know about his condition, my team got in touch so we can help him in any way we could. I am glad that the surgery was successful, and he is doing well".
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)