పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, హై-వోల్టేజ్ ఆసియా కప్ 2023 కోసం వారి జట్టును ప్రకటించింది. ఈ రెండు అసైన్‌మెంట్‌లు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సన్నాహకంగా చాలా ముఖ్యమైనవి. శ్రీలంక వేదికగా ఆగస్ట్ 22 నుంచి 26 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ వన్డే టోర్నీ జరగనుంది.
ఈ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనుండగా.. షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో కొత్తగా ఫహీమ్ అఫ్రాఫ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్‌లు చోటు దక్కించుకోగా.. పేలవ ఫామ్ కారణంగా షాన్ మసూద్‌పై వేటు పడింది. గాయం నుంచి ఇంకా తేరుకోని ఇహసానుల్లాను ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
ఆసియా కప్-2023, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు పాక్ జట్టు..
అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అఫ్రాఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఇమామ్ ఉల్ హాక్, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్
Here's PCB Tweet
🚨 Our squad for the Afghanistan series and Asia Cup 🚨
Read more: https://t.co/XtjcVAmDV7#AFGvPAK | #AsiaCup2023 pic.twitter.com/glpVWF6oWW
— Pakistan Cricket (@TheRealPCB) August 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)