రోహిత్ శర్మను ఎవ్వరికీ సాధ్యం కాని మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. త్వరలో జరగనున్న ఆఫ్ఘనిస్తాన్‌ టీ20 సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్‌ ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

రోహిత్‌ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆలగాళ్లు వరుసగా న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ (122 మ్యాచ్‌ల్లో 173 సిక్సర్లు), ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (125),క్రిస్‌ గేల్‌ (124), సూర్యకుమార్‌ యాదవ్‌ (123) విరాట్ కోహ్లీ (117) ఉన్నారు. జనవరి 11 (మొహాలీ), 14 (ఇండోర్‌), 17 (బెంగళూరు) తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది.

Here's News

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)