టీ20 వరల్డ్‌కప్ రెండవ సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియాపై విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ మూమెంట్ చోటుచేసుకున్నది. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ హఫీజ్ బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ గమ్మత్తైన షాట్ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేసిన హఫీజ్ తన తొలి బంతిని వార్నర్‌కు బౌల్ చేశాడు. అయితే ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చిన వార్నర్.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని భారీ షాట్‌తో సిక్సర్‌గా మలిచాడు. ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్రకటించారు. దీంతో పాకిస్థాన్‌కు మరింత కష్టాలు ఎదురయ్యాయి. వార్నర్ ఆ తరువాత నుంచి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
— Shaun (@ShaunakCric) November 11, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)