ఉమ్రాన్ మాలిక్ యార్క‌ర్ల‌కు ఇర‌గ‌దీస్తున్నాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో త‌న స్పీడ్‌తో య‌మ హీటెక్కించాడు. బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టించాడు. గుజ‌రాత్ ఓపెన‌ర్ వృద్ధిమాన్ సాహాను .. హైద‌రాబాద్ పేస‌ర్‌ ఉమ్రాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. భారీ షాట్ల‌తో అల‌రిస్తున్న సాహాకు.. ఉమ్రాన్ త‌న యార్క‌ర్‌తో బ్రేకేశాడు. 153 కిలోమీట‌ర్ల వేగంతో వ‌చ్చిన ఆ బంతికి సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్ర‌లోనే ఇది అత్యంత స్పీడ్ బాల్ అని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)