ఆసియా కప్ టీ2024 టోర్నీలో నేపాల్ మహిళల క్రికెట్ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. టోర్నీ చరిత్రలో తొలి విజయం సాధించడంతో నేపాల్ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. విన్నింగ్ రన్ కొట్టగానే నేపాల్ ఆటగాళ్లంతా మైదానంలో చేరి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్, మహిళల ఆసియా కప్ టోర్నీలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కాగా తొలి మ్యాచ్‌లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Here's Video
HISTORY CREATED BY NEPAL....!!!
- Nepal won their first ever match in Women's Asia Cup history. 🫡 pic.twitter.com/V8CwPaybqe
— Johns. (@CricCrazyJohns) July 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)