Nikhat Zareen: నిఖత్ జరీన్ కు ప్రధాని మోదీ అభినందనలు, దేశం గర్వించేలా అద్భుతమైన బంగారు పతకాన్ని సాధించావంటూ ట్వీట్
తెలంగాణకు చెందిన బాక్సర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మా బాక్సర్లు మమ్మల్ని గర్వించారు! మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన బంగారు పతకాన్ని సాధించినందుకు @nikhat_zareenకి అభినందనలు అని తెలిపారు.
ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) విజేతగా నిలిచింది. గురువారం 52కేజీ ఫ్లయ్‌వెయిట్ విభాగంలో (World Boxing Championships 2022) జరిగిన ఫైనల్లో తను 5-0 తేడాతో జిట్‌పాంగ్ జుటామస్ (థాయ్‌లాండ్)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది. మూడు రౌండ్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల నిఖత్ ప్రత్యర్థిపై ఆరంభం నుంచే పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. దీంతో 30-27, 29-28, 29-28, 30-27, 29-28 స్కోరింగ్‌తో జడ్జీలు ఏకగ్రీవంగా విజేతను ప్రకటించారు. తెలంగాణకు చెందిన బాక్సర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మా బాక్సర్లు మమ్మల్ని గర్వించారు! మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన బంగారు పతకాన్ని సాధించినందుకు @nikhat_zareenకి అభినందనలు అని తెలిపారు.
Our boxers have made us proud! Congratulations to @nikhat_zareen for a fantastic Gold medal win at the Women's World Boxing Championship. I also congratulate Manisha Moun and Parveen Hooda for their Bronze medals in the same competition. pic.twitter.com/dP7p59zQoS
— Narendra Modi (@narendramodi) May 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 20, 2022 11:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

