ఒలింపిక్స్‌లో పతకం ఖాయమనుకున్న బాక్సింగ్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకంతో మెరిసిన అంతిమ్ పంగల్(Antim Panghal) పారిస్ ఒలింపిక్స్ 2024లో మాత్రం నిరాశపరిచాడు. 51 కిలోల విభాగంలో ఈ స్టార్ బాక్సర్ 16వ రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మంగళవారం జాంబియా బాక్సర్ ప్యాట్రిక్ చిన్యెంబా(Patrick Chinyemba)తో అమిత్ తలపడ్డాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పంచ్‌లతో దాడి చేసిన భారత బాక్సర్ పాయింట్లు మాత్రం సాధించలేకపోయాడు. తొలి రౌండ్ తర్వాత కోచ్ సలహా మేరకు అంతిమ్ వ్యూహం మార్చినా అతడికి కలిసి రాలేదు. చివరకు మెజారిటీ అంపైర్ల నిర్ణయం మేరకు భారత బాక్సర్ ఓటమిపాలయ్యాడు. దాంతో, మహిళా బాక్సర్లు నికత్ జరీన్, నిషాంత్ దేవ్, లొవ్లినా బొర్గెహైన్‌లపైనే భారత్ పతకం ఆశలు పెట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం
Here's News
Amit Panghal lost 1-4 to Seed No.3 Patrick 🇿🇲 in Round of 16 of Men's 51 kg
Heartbreaking results, Another 1st round exit in Olympics for him 💔😢#Boxing #ParisOlympics2024 pic.twitter.com/gXJCyPacib
— The Khel India (@TheKhelIndia) July 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)