ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. వారిలో ఒకరు ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది. మిగతా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు తెలిపింది. తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు ఒమన్ నుంచి, ఇద్దరు యూఏఈ నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు రాష్ట్రానికి వచ్చారు. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి పెరిగింది.
7 more people tested positive for #OmicronVariant in #AndhraPradesh increasing the total number of people infected with #Omicron to 24. All their contacts are traced, tested and positive samples were sent for #Genome sequencing#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7nxCAhKrBi
— ArogyaAndhra (@ArogyaAndhra) January 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)