తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు. అయితే దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్ వారికి తెలిపారు.
ఆ తర్వాత దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జనసేన నేతలు పోలీసులను ఏమార్చి కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ చేయిచేసుకున్నారు. ఓ నేత రెండు చెంపలపైనా ఆమె కొట్టారు. సీఐ దురుసు ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Here's Video
శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త చెంప దెబ్బ కొట్టిన సీఐ అంజు యాదవ్.#Jansena #Srikalahasthi pic.twitter.com/gThhAQeCQq
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)