భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై (Andhra Pradesh Floods) శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (CM YS Jagan Mohan reddy VC) నిర్వహించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తిరుపతి, తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా స్థానికులు వారికి సహాయ, సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు గండ్లు పడినచోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఆయా జిల్లాలకు అదనంగా నిధులు మంజూరు చేయాలని సీఎం స్పష్టం చేశారు.
వర్షాలతో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించండి
- పంట నష్టాన్ని నమోదులో కాస్త ఉదారత చూపించాలి
- మళ్లీ పంట వేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా
- ఎలాంటి సాయం కావాలన్నా యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం https://t.co/pykL2kufRP
— YSR Congress Party (@YSRCParty) November 19, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)