సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు.  ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి చేరుకున్నారు. సీఎంకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం దార్లపూడి వెళ్లారు. అక్కడ పోలవరం ఎడమ కాల్వకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. వివిధ అంశాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అనంతరం కాల్వను పరిశీలించారు. వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ

మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్‌ జోన్‌ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై.. ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)