వైసీపీ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ పోరాటం చేస్తున్న‌ది ఒక్క చంద్ర‌బాబుతో కాద‌ని చెప్పిన సీఎం.. చంద్ర‌బాబుతో ఏమీ కాద‌ని, చంద్ర‌బాబు నథింగ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5ల‌తో యుద్ధం సాగిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే ఈ సంస్థ‌ల‌ను ఉన్మాదులుగా అభివ‌ర్ణించారు. వైసీపీ యుద్ధం సాగిస్తున్న‌ది ఉన్మాదుల‌తోన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

మంగ‌ళ‌వారం నాడు అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత అసెంబ్లీ మీటింగ్ హాలులోనే జ‌రిగిన ఈ స‌మావేశంలో టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించిన జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేసేలా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడున్న మంత్రివ‌ర్గంలో మెజారిటీ మంత్రుల‌ను కేబినెట్ నుంచి తొల‌గించ‌నున్నట్లుగా కూడా ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)