అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా ఉన్నారు. ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది
విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మం. దొంతికుర్రు ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు కరెంట్ షాక్ ఘటనపై సీఎం శ్రీ వైయస్ జగన్ దిగ్భ్రాంతి. చనిపోయిన బాలుని కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం.
చికిత్స పొందుతున్న విద్యార్ధులకు రూ.లక్ష అందించాలని ఆదేశం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 28, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)