ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకుగాను మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించిన విషయం తెలిసిందే. చిరంజీవి ట్వీట్‌పై సీఎం జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఏపీ ప్రభుత్వం తరపున చిరంజీవికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడానికి ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వైద్యులు, మండల, జిల్లా అధికారులు, జాయింట్‌ కలెక్టర్లు, కలెక్లర్లు అందరి సహకారంతో ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైందని సీఎం జగన్‌ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)