రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ రూ. 20,000 కోట్ల విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అయితే ఇందుకోసం ఇవాళ కావలిలో పర్యటించిన ఆయన.. ఆ పర్యటనపై ట్వీట్‌ చేశారు.

ద‌శాబ్దాలుగా నెల‌కొన్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపేలా నేడు రాష్ట్రంలోని 2,06,171 ఎక‌రాల చుక్క‌ల భూముల‌పై 97,471 మంది రైత‌న్న‌ల‌కు స‌ర్వ హ‌క్కులు క‌ల్పించే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని మ‌న ప్రభుత్వంలో వారికి అన్ని విధాలా అండ‌గా నిలుస్తున్నాం అని సభలో ప్రసంగించిన వీడియోను పోస్ట్‌ చేశారాయన.

Here's CM Jagan Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)