ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే స్థానికంగా ఓ ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటానని పవన్ ప్రకటించారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం గృహప్రవేశం చేశారు. ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్నారు. పంచాగశ్రవణం సహా పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో లైవ్ ఏర్పాటు చేసింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)