జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నామినేషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేశారు పపన్. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300. ఇందుకు ఆదాయపన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌ అప్పులు రూ.64,26,84,453గా ప్రకటించారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లు అని వివరించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)