ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ సర్కారు ఢీకొట్టేందుకు బీజేపీతో పొత్తు కోసం జనసేన, టీడీపీ అధినేతలు ఢిల్లీలోని కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ హస్తినలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షాతో వారిరువురు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంతో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.  మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, అధికారికంగా ప్రకటించిన సీఎం జగన్ టీం

తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆరు పార్లమెంట్ స్థానాలు రాజమండ్రి, నరసాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, అరకు స్థానాలను బీజేపీ కోరుతోంది. అయితే, టీడీపీ మాత్రం రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు ఇస్తామని బీజేపీకి ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Reports

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)