ఏపీలో నెల్లూరు జిల్లాలో కరెంట్‌ షాక్‌(Electric Shock)తో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని కలిగిరి మండలం కుమ్మర కొండూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి (35) పొలం వద్ద ఉన్న బోరు మోటారు మరమ్మతుకు గురైంది. దీంతో రైతు అయ్యప్పరెడ్డి పాలెంకు చెందిన ప్రైవేట్‌ మెకానిక్‌ నారాయణ(40) ను ఆశ్రయించాడు. గురువారం ఇద్దరూ పొలం వద్ద మోటార్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)