ఏపీలోనూ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. నిన్న ఏపీ వ్యాప్తంగా 5 లక్షల మంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేశారు. ఏపీలో మొత్తం 6,454 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేసిన‌ట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 72,146 మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. కృష్ణా జిల్లాలో నిన్న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం రాత్రి ఏడు గంటల వరకు కొన‌సాగింది. ఆ జిల్లాలో 64 వేల మంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో 40 వేల మందికి చొప్పున వ్యాక్సిన్లు వేశారు. చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్‌లో భాగంగా ప్ర‌తి ఒక్క‌రికి 0.5 ఎంఎల్ డోసు వేశారు. మొద‌టి డోసు తీసుకున్న‌ 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తారు. ఈ వ్యాక్సినేష‌న్‌ను ఈ నెల 7వ తేదీ వరకు నిర్వ‌హిస్తారు. ఇక నిన్న దేశ వ్యాప్తంగా మొత్తం 41 లక్షల మందికి చిన్నారుల‌కు వ్యాక్సిన్లు వేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)