Corona in AP: ఏపీలో కొత్తగా 122 మందికి కరోనా, గత రెండు రోజుల నుంచి మరణాలు నిల్

ఏపీలో గడచిన 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంత‌పురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Corona in AP: ఏపీలో కొత్తగా 122 మందికి కరోనా, గత రెండు రోజుల నుంచి మరణాలు నిల్
Coronavirus in India (Photo Credits: PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంత‌పురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అంతేకాకుండా వ‌రుస‌గా రెండో రోజు కూడా రాష్ట్రంలో క‌రోనాతో గురువారం నాడు మ‌ర‌ణాలేమీ సంభ‌వించ‌లేదు.

అదే సమయంలో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,176 మంది కరోనా బారిన పడగా, వారిలో 23,01,904 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,543 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డ‌చిన రెండు రోజులుగా రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాలేమీ లేక‌పోవ‌డంతో కరోనాతో ఇప్పటిదాకా మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,729గానే ఉంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 03, 2022 08:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).