టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు . కుక్కలకు ఉన్న విస్వాసం రైతులకు ఉండదంటూ బాంబు పేల్చారు. లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి.. కాలువల పూడికలు తీయించానని.. కానీ తన మీటింగ్ కు రైతులు ఎవరూ రాలేదని ఆగ్రహించారు. ఈ తరుణంలోనే.. కుక్కలకు ఉన్న విస్వాసం కొంత మందికి ఉండదంటూ కామెంట్స్ చేశారు.
మేము అధికారంలోకి వస్తాం,కూటమి నేతలు సంగతి అప్పుడు తేలుస్తాం, వైఎస్ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి విదితమే. దీంతో తిరువూరు మండలం చిట్టేల గ్రామనికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని నిరసనకు దిగారు. మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు….మహిళ సిబ్బందికి ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్ లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Here's Video
రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కుక్కలకు ఉన్న విస్వాసం రైతులకు ఉండదు - టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు pic.twitter.com/mhEqKMk9Tt
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)