ఏపీలో గడచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,475 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో 3,063 కేసులు గుర్తించారు. అదే సమయంలో 20,811 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 13,23,019 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9,904కి పెరిగింది.
Here's AP Covid Report
#COVIDUpdates: As on 21st May 2021 10:00 AM
COVID Positives: 15,39,184
Discharged: 13,20,124
Deceased: 9,904
Active Cases: 2,09,156#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JcQAJGspiP
— ArogyaAndhra (@ArogyaAndhra) May 21, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)