ఏపీలోని కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా డ్రైవర్ కు బీపీ లెవల్స్ తగ్గడంతో కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కరరావుకు బీపీ డౌన్ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయారు. దీంతో, బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న కరెంట్ పోల్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Here's Video
టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా
విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్‌కి బీపీ లెవెల్స్ తగ్గడంతో బోల్తా.
ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉండగా అదృష్టం కొద్దీ ఎవరికీ ఏమీ కాలేదు. pic.twitter.com/Itzt54J9tK
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)