తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలపై అల్లుడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను చితకబాదాడు. దీంతో మామ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్ర గాయాల పాలైన అత్తను స్థానికుల సహాయంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న కొవ్వురు డీఎస్పీ వీఎస్‌ వర్మ, సీఐ వైవీ రమణ..సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అల్లుడి దాడిలో మృతిచెందిన మామను రాయంకుల శ్రీరాకృష్ణగా, గాయాలైన అత్త బేబీ(61)గా గుర్తించారు. అల్లుడిని దొమ్మేరుకు చెందిన నందిగం గోపి(42)గా తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Representational Image | (Photo Credits: IANS)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)