కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడిలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒకరు బోరుకు సంబంధించిన రైతు కాగా మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందినవారు.
పామాయిల్ తోటలో వ్యవసాయ బోరుకు మరమ్మతులు చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురయ్యారు. పొలంలోని విద్యుత్ తీగలు పైపులకు తగలడంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Here's Disturbed Video
కరెంట్ షాక్ కొట్టి కాకినాడలో ముగ్గురు రైతులు మృతి
కాకినాడ - ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి. ఒకరు బోరుకు సంబంధించిన రైతు కాగా మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందినవారు. pic.twitter.com/G8d7epNhll
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)