బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రషీద్ చిత్రపటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. రషీద్ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దు..అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.
అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని వైసీపీ అధినేత అన్నారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తాం. ఏపీ పరిస్థితులపై బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేస్తాం. అరాచక పాలనకు నిరసనగాఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిని నేను ధర్నాకు దిగుతా.. కలిసి ధర్నాకు దిగుతాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని జగన్ అన్నారు. మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించివేస్తాం, జగన్ మీద విరుచుకుపడిన నారా లోకేష్
Here's Video
రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన @ysjagan అన్న pic.twitter.com/xgo4p47ay1
— జగనన్నతో... సిద్ధం ❤️ 2029 (@CMYSJaganFan) July 19, 2024
వినుకొండలో టీడీపీ గూండా చేతిలో హత్యకి గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఇంటికెళ్లి పరామర్శించిన వైయస్ జగన్ గారు.#SaveAPFromTDP pic.twitter.com/pzj7loe4Bs
— YSR Congress Party (@YSRCParty) July 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)