Vjy, July 18: వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) ఎక్స్ (X) వేదికగా చేసిన వ్యాఖ్యలపై విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు.
రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వినుకొండ వైసీపీ కార్యకర్త హత్యపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు కీలక ప్రకటన, వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని వెల్లడి
శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది.
Here's Lokesh Tweet
హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి…
— Lokesh Nara (@naralokesh) July 18, 2024
ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించం.. ఏ నిందితుడినీ వదిలేది లేదు. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిది’’ అని లోకేశ్ తెలిపారు.