ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఆమదాలవలసలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను తమ్మినేని ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా ఆటగాడి అవతారం ఎత్తి ఒక టీమ్ తరపున కూతకు వెళ్లారు. ఉత్సాహంగా ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి కాలు జారి కిందపడిపోయారు. దీంతో వెంటనే సెక్యూరిటీ గార్డులు స్పందించి ఆయనను లేవనెత్తారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కబడ్డీ ఆటలో క్రింద పడిన స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. #AP #YCP #UANow pic.twitter.com/qlcqlcr49X
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) December 23, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)