ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరారు. నేడు జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. సీఎం వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఉన్నారు. బాపట్లలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్.. క్రమం తప్పకుండా త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు ₹694 కోట్లను నేడే వారి తల్లుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.#JaganannaVidyaDeevena #CMYSJagan pic.twitter.com/kwbquXyld6
— YSRCP Digital Media (@YSRCPDMO) August 11, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)