Vijayawada, Mar 17: ఆంధ్రప్రదేశ్ లో నేడు (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 (APPSC Group-1 Prelims) స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్)కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు (Exam Centers) నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు.
APPSC Group 1 Prelims : రేపే ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, 301 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ- సీఎస్ జవహర్ రెడ్డి#APPSC #Group1Prelims #Group1 #APJobs https://t.co/nIALjAssry
— Hindustan Times Telugu (@HtTelugu) March 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)