టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా చేశారు. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ శోభా హైమావతి ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు.

రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబుకు పంపనున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే హైమావతి కూతురు స్వాతి వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తన కూతురు పార్టీ మారితే.. తనను టీడీపీకి దూరం పెట్టడం సరికాదని హైమావతి చెప్పుకొచ్చారు. హైమా రాజీనామా చేసిన తర్వాత అధికార వైసీపీలో చేరుతారా..? లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)