మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Sake Sailajanath) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు.
అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరుపున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైఎస్సార్‌సీపీలోకి చేరానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని శైలజానాథ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Former Minister Sake Sailajanath Joins YSR Congress Party
07.02.2025
తాడేపల్లి
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ గారు
శైలజానాథ్ గారితో పాటు వైఎస్సార్‌సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ… pic.twitter.com/JeXLwmF09y
— YSR Congress Party (@YSRCParty) February 7, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)