ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు.తమ తోటలో మంచి చింతచిగురు చూసి తన చిన్నతనంలోని అనుభవాలు గుర్తు కొచ్చాయని చెప్పారు. నా చిన్నతనంలో అమ్మ నరసమ్మ అలా నడుచుకుంటూ వెళ్లి మా తోటలో చింతచిగురు కోసుకొచ్చి పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో నెయ్యి వేసి పెట్టిన రోజులు గుర్తుకొచ్చాయి. తోటలో చిగురు కోసుకొని పప్పు చేయించుకొని తినాలనిపించింది అని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
కాగా రఘువీరారెడ్డి తన తోటలో పనులు చేస్తూ ట్విట్టర్ ఖాతాలో అప్పుడప్పుడు ఫొటోలు పోస్టు చేస్తుంటారు. తన మనవరాలి క్యూట్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తుంటారు. తెల్లగడ్డంతో సాధారణ రైతులా ఆయన కనపడుతోన్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. సత్యసాయి జిల్లా నీలకంఠా పురంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు.
మా తోటలో మంచి చింతచిగురు చూసి
నా చిన్నతనంలో మా అమ్మ నరసమ్మ
అలా నడుచుకుంటూ వెళ్లి మా తోటలో
చింతచిగురు కోసుకొచ్చి
పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో నెయ్యి వేసి పెట్టిన రోజులు గుర్తుకొచ్చి,తోటలో చిగురుకోసుకొని పప్పు చేయించుకొని తినాలనిపించింది. pic.twitter.com/n2MNgl6G3J
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) May 2, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)