మచిలీపట్నం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు 1500 కేజీలు గల భారీ సొర చేప చిక్కింది. దీన్ని మచ్చల సొర అని పిలుస్తారు. గిలకలదిండి వద్ద స్థానిక మత్స్యకారులు దీన్ని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ క్రేన్ సాయంతో దీన్ని వెలుపలికి తీసుకువచ్చారు. చెన్నైకి చెందిన వ్యాపారులు ఈ భారీ సొర చేపను కొనుగోలు చేశారు. ఈ తరహా సొర చేపలు తీరానికి చేరువగా రావడం చాలా అరుదు. ఒక్కోసారి ఇతర చేపలను వేటాడుతూ ఇవి తీరాలకు దగ్గరగా వస్తుంటాయి. అలాంటి సమయాల్లోనే మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి.  దారుణం, ఫోటోల కోసం పిల్లల్ని పెద్ద మొసలి నోరు దగ్గరికి పంపిన తల్లిదండ్రులు, సీన్ కట్ చేస్తే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)