ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారి తెలిపారు.ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.  ఫుడ్ పాయిజన్.. 49 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)