జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ తనను రూ.1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు (Kiran Royal Extortion Case) చేయడం విదితమే. తాజాగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగించుకుని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆన్ లైన్ చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ ఉదయం లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి కిరణ్ రాయల్ పై ధ్వజమెత్తింది. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని... తనకు ఎవరూ తెలియదని చెప్పింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ తన పరిస్థితి పట్ల స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరింది. పదేళ్ల కిందటే డబ్బు వ్యవహారం సమసిపోయిందని కిరణ్ రాయల్ చెబుతున్నాడని... మరి రెండేళ్ల కింద బాండ్ ఎందుకు రాసిచ్చినట్టు? అని లక్ష్మి ప్రశ్నించింది. జనసేన అధికారంలో ఉండడంతో ఈ విషయంలో కిరణ్ రాయల్ ను ఎవరూ నిలదీసి అడగడంలేదని, ఒక మహిళకు ఇంతటి అన్యాయం జరుగుతుంటే ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించింది.
జనసేన కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్
తిరుపతిలో జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు
పాత చెక్ బౌన్స్ కేసుని తెరపైకి తెచ్చి.. జైపూర్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి లక్ష్మీని అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం
గత మూడు రోజులుగా తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ మోసాల్ని మీడియా… pic.twitter.com/bWmDwFeDUj
— YSR Congress Party (@YSRCParty) February 10, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)