అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏ14గా లోకేష్‌ ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ స్కాంకు పాల్పడినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి విదితమే.

Nara Lokesh (Photo/TDP)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)