గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. అయితే, వేడుక ముగిసిన త‌ర్వాత‌ వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చ‌నిపోయారు.

అభిమానుల మృతి విష‌యం తెలుసుకున్న‌ రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులతో పాటు తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల చొప్పున‌ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చరణ్ మాట్లాడుతూ.. ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయి పవన్‌ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధపడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌స్తున్నాను'' అని అన్నారు.

గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి, మృతుల కుటుంబాలకు జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

ఇక ఇప్ప‌టికే మృతుల కుటుంబాల‌కు నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిహారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దిల్ రాజు చెరో రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌గా... ప‌వ‌న్ కూడా రూ.5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా త‌గిన స‌హాయం అందించే ఏర్పాట్లు చేయాల‌ని త‌న కార్యాల‌య అధికారుల‌ను జ‌న‌సేనాని ఆదేశించారు.

Ram Charan Reacts on Game Changer pre Release Event Tragedy 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)