ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైఎస్‌ షర్మిల (YS Sharmila) వెల్లడించారు. ఈ మేరకు ఆమె Xలో ట్వీట్‌ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మంగళవారం మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం’’ అని షర్మిల పేర్కొన్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)