టీడీపీ నేత పట్టాభి రామ్ సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. దానికి నిరసనగా ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులు చేసిన సంగతి విదితమే. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైన దీక్ష రేపు రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. అధినేత దీక్ష నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు కూడా కార్యాలయానికి చేరుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)