ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు.రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతు టీడీపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ-జనసేన కూటమి ఖాతాలో మరో రెండు విజయాలు, శాసన మండలిలోనూ పెరుగుతున్న బలం
విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కానున్నారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై సమావేశంలో చర్చించే అవకాశముంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. తమకు ఏపీ ప్రభుత్వం రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతుండగా, తమకే రూ.7 వేల కోట్లు వస్తాయని ఏపీ చెబుతోంది.
Here's Video
#WATCH | TDP workers and supporters welcome party chief and Andhra Pradesh CM N Chandrababu Naidu on his first visit to Hyderabad after becoming the CM pic.twitter.com/nAm0BfBQhG
— ANI (@ANI) July 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)