Tirumala Leopards: తిరుమల నడకమార్గంలో భయం.. భయం.. చిరుతలు, ఎలుగుబంట్ల హల్ చల్.. వీకెండ్ లో కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు

తిరుమల నడకమార్గంలో భక్తులు భయంభయంగా గడుపుతున్నారు. చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువవ్వడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

Tirumala Leopards: తిరుమల నడకమార్గంలో భయం.. భయం.. చిరుతలు, ఎలుగుబంట్ల హల్ చల్.. వీకెండ్ లో కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు
Cheetah-Oban

Tirumala, Aug 21: తిరుమల (Tirumala) నడకమార్గంలో భక్తులు (Devotees) భయంభయంగా గడుపుతున్నారు. చిరుతలు (Leopard), ఎలుగుబంట్ల (Bear) సంచారం ఎక్కువవ్వడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. అలిపిరి మార్గంలో ఇటీవల ఓ బాలికపై చిరుత దాడిచేసి చంపేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డైంది. నడకమార్గంలోని ఏడో మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు సంచరిస్తూ కనిపించాయి. నిన్న సాయంత్రం నరసింహస్వామి ఆలయ సమీపంలోనూ ఎలుగుబంటి సంచరించింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 21, 2023 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).