Hyderabad, Aug 1: తెలుగురాష్ట్రాల (Telugu States) ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సన్నాహాలు చేస్తోంది. నంద్యాల జిల్లా డోన్ మీదుగా వెళ్లే ఈ రైలు ట్రయల్ రన్ లో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటలకు డోన్‌లో బయలుదేరి 10.30 గంటలకు కాచిగూడకు చేరుకుంది. ప్రస్తుతం అధికారులు ఈ రైలును స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం-5పై నిలిపి ఉంచారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభం కానున్నది.
హైదరాబాద్‌కు మరో వందేభారత్ రైలు#VandeBharat #IndianRailways #Kachiguda #Hyderabad #Telangana #YouSay pic.twitter.com/RmBmp1SNJO
— yousaytv (@yousaytv) July 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)