Hyderabad, Nov 17: 28,057 మంది ఓటర్లు (Voters) ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు. వీరంతా ఓటు వేసే తేదీని ముందుగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నిర్ణయిస్తారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. అత్యధికంగా సిద్దిపేట (Siddipet) నియోజకవర్గంలో 757 మంది, బాల్కొండ 707, సత్తుపల్లి 706, పెద్దపల్లి 640, బహుదూర్‌పురా 11 మంది, అలంపూర్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 12 మంది చొప్పున ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)