Delhi, Aug 16: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్‌ది అన్నారు. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఆప్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటేనే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కవిత బెయిల్‌కు బీజేపీకి సంబంధం లేదని, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు సంజయ్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, కేసీఆర్ గవర్నర్ అవుతారన్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఏ పదవో తెలుసా?
Here's Tweet:
బండి సంజయ్ సంచలన కామెంట్స్
అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం
కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం@revanth_anumula @bandisanjay_bjp @INCTelangana @BJP4Telangana @BRSparty @KTRBRS https://t.co/uby33gtLGS pic.twitter.com/9M4tPMYSKd
— Telangana Awaaz (@telanganaawaaz) August 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
